Sports

Yashasvi Jaiswal Amongst Nominees For ICC Mens Player Of The Month Award For February


ICC reveal Player of the Month nominees for February: ఈ ఏడాది భీకర ఫామ్‌లో ఉన్న యశస్వీ జైస్వాల్‌(Yashasvi Jaiswal) ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌(ICC Men’s Player Of The Month) రేసులో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న జైస్వాల్…. ఐసీసీ అవార్డు రేసులో నిలిచాడు. ఫిబ్రవ‌రి నెల‌కు  ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ సంబంధించిన నామినీస్ జాబితాలో య‌శ‌స్వి జైస్వాల్‌తో పాటు కివీస్ స్టార్ ఆట‌గాడు కేన్‌ విలియమ్సన్‌, శ్రీలంక ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక లు చోటు సంపాదించారు. ఫిబ్రవ‌రి నెల‌లో వీరి ప్రద‌ర్శన‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని వీరిని ఐసీసీ నామినేట్ చేసింది ఇంగ్లాండ్‌తో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌లో జైస్వాల్ 112 స‌గ‌టుతో 560 ప‌రుగులు చేశాడు. ఇందులో వ‌రుస మ్యాచుల్లో డ‌బుల్ సెంచ‌రీలు సైతం ఉన్నాయి. దక్షిణాప్రికా పై మూడు శ‌త‌కాల‌తో కేన్‌ విలియ‌మ్సన్‌ రికార్డు నెల‌కొల్పాడు . అఫ్గానిస్తాన్‌తో జ‌రిగిన 3 వ‌న్డేల్లో ఓ ద్విశ‌త‌కం, మ‌రో సెంచ‌రీతో నిస్సంక  350 కి పైగా ప‌రుగులు చేశాడు  మ‌హిళ‌ల విభాగంలో యూఏఈకి చెందిన కవిష ఎగోడగే, ఈషా ఓజా, ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్ లు ఫిబ్రవరి నెలకు సంబంధించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా నిలిచారు. 

ఇంగ్లండ్‌(England)తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా(Team India) యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal) చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు, రెండు డబుల్ సెంచరీలు సాధించిన యశస్వీ 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ మినహా మరే బ్యాటర్ కనీసం 300 పరుగులు కూడా చేయలేదు. ఈ క్రమంలో ఓ టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన తొలి భారత ఎడమ చేతి బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 600 పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. జైస్వాల్ కంటే ముందు రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ కూడా మూడు వందల పరుగులు చేశారు. 

సెహ్వాగ్‌ రికార్డు బద్దలు 
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భీకర ఫామ్‌లో వరుస శతకాలు సాధిస్తున్న యశస్వి జైస్వాల్‌.. మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.   
ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో 600పరుగులకుపైగా పరుగులు సాధించాడు. మూడో టెస్ట్‌ సెకండ్ ఇన్నింగ్స్‌లో యశస్వీ 12 సిక్సులు బాదేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సులు, 14 ఫోర్లు బాది డబుల్ సెంచరీతో వీర విహారం చేశాడు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో, ఈ క్యాలెండర్ ఇయర్‌లో 23 సిక్సులు బాదాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన టీమిండియా బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో షోయబ్ బషీర్ వేసిన ఓవర్లో సిక్సు కొట్టడం ద్వారా జైస్వాల్ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. 2008లో సెహ్వాగ్ 22 సిక్సులు బాదాడు. తాజాగా 23 సిక్సులతో సెహ్వాగ్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లోనే జైస్వాల్ ఈ రికార్డును చేరుకున్నాడు. దీంతో ఈ ఏడాది జైస్వాల్ మరిన్ని సిక్సులు కొట్టనున్నాడు. 21 సిక్సులు కొట్టిన రిషబ్ పంత్, 20 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ, 18 సిక్సులు కొట్టిన మయాంక్ అగర్వాల్ ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు .



Source link

Related posts

Netherlands vs South Africa: ప్రపంచకప్‌లో పెను సంచలనం, నెదర్లాండ్స్‌ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు

Oknews

సముద్రంతో పోటీ పడేలా ఫ్యాన్స్ ఫోటోలు తీసుకుంటున్న ద్రవిడ్

Oknews

U19 World Cup Final 2024 IND Vs AUS Under 19 World Cup AUS Under19 Chose To Bat | IND Vs AUS U19 Final: టాస్ గెలిచిన కంగారూలు

Oknews

Leave a Comment