ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ…. అభ్యర్థుల పేరును ప్రకటించే అవకాశం తనకు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు. సామాజిక న్యాయాన్ని మాటల్లో కాకుండా చేతుల్లో చేసి చూపించిన పార్టీ వైెఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. 175 సీట్లలో అత్యధిక సీట్లు ఎస్సీ,ఎస్సీ, బీసీ మైనార్టీ వర్గాలకు ఇచ్చామని పేర్కొన్నారు. ఇందులో 24 మంది మహిళలు ఉన్నారని చెప్పారు. సామాజిక మార్పు దిశగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. ఎంపీ సీట్లలో 11 స్థానాలను బీసీలకు ఇచ్చామని వెల్లడించారు. 175 సీట్లలో 59 సీట్లు బీసీలకే కేటాయించామని చెప్పారు. బీసీలకు ఈ స్థాయిలో ఏ పార్టీ కూడా సీట్లు ఇవ్వలేదని ధర్మాన గుర్తు చేశారు. మైనార్టీలకు గత ఎన్నికల్లో 5 సీట్లు ఇస్తే…ఈసారి ఏడు కేటాయించినట్లు వివరించారు. 2019తో పోల్చితే ఈసారి మహిళలకు ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ ప్రకటించారు.