Sports

Yuvraj Singh gives a derogatory statement towards Abhishek Sharma after SRH batsmans historic knock vs Mumbai Indians


Yuvraj Singh gives a derogatory statement towards Abhishek Sharma : ముంబైపై సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన హైదరాబాద్‌ క్రికెటర్‌ అభిషేక్‌ శర్మ( Abhishek Sharma)పై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. కేవలం 16 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసిన అభిషేక్‌ను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే మరింత దూకుడుగా ఆడే క్రమంలో చెత్త షాట్‌కు యత్నించి అభిషేక్‌ అవుటయ్యాడు. ఇప్పుడు దీనిపై మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌(Yuvraj Singh) స్పందించాడు. అభిషేక్ సూపర్ ఇన్నింగ్స్‌ ఆడావని అభినందించిన యువీ సున్నితమైన హెచ్చరిక కూడా చేశారు. మంచి ఇన్నింగ్స్‌ ఆడినప్పుడు అంత చెత్త షాట్‌కు ఔట్‌ కావడం మంచిది కాదని.. మరోసారి అలాగే అవుటైతే నీ కోసం దెబ్బలు సిద్ధంగా ఉంటాయని యువీ పోస్ట్‌ చేశాడు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. యువీ పొగడ్తలను చాలామంది రీ పోస్ట్‌ చేస్తున్నారు.

హైదరాబాద్‌ తరపున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ

ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబాద్‌ (Sunrisers Hyderabad) తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఉప్పల్‌ స్టేడియంలో బౌండరీల మోత మోగుతోంది. మఫాకా వేసిన 10 ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 16 బంతుల్లోనే అభిషేక్‌ శర్మ (54*) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ స్కోర్‌ 148/2. 22 బంతుల్లోనే 63 పరుగులు చేసి అభిషేక్‌ అవుటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అభిషేక్‌ అవుటయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సులతో అభిషేక్‌ 63 పరుగులు చేశాడు. ట్రానిస్‌ హెడ్‌ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు.

ప్రత్యర్థి జట్లకు హైదరాబాద్‌ హెచ్చరిక

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) బ్యాటింగ్ కంటే బౌలింగ్‌పైనే ఎక్కువగా ఆధారపడే జట్టుగా ఇప్పటివరకూ పేరొంది. ఏదో ఒక మ్యాచ్‌లో ఓ ఆటగాడు రాణించడం… తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి విజయాలను అందించడం సన్‌రైజర్స్‌ జట్టులో పరిపాటి. కానీ ఈ ఆటతీరులో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏదో పూనకం వచ్చినట్లు తమ జట్టును తక్కువగా అంచనా వేస్తున్నారన్న కోపం కావచ్చు తమను తాము నిరూపించుకోవాలన్న కసి కావచ్చు తాము ఆడితే ఎలా ఉంటుందో క్రికెట్‌ ప్రపంచానికి చెప్పాలన్న ఉద్దేశం కావచ్చు కారణమేదైనా సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు… ప్రత్యర్థి జట్లకు గట్టి హెచ్చరికలే పంపారు. తమను తక్కువ చేసి చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్‌ ఇచ్చేశారు. ఏదో ఒక బ్యాటర్‌ కాదు హెడ్‌, అభిషేక్ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్‌క్రమ్‌ ఇలా విధ్వంసకర బ్యాటర్లు… ప్రత్యర్థి జట్ల బౌలర్లకు గట్టి సవాల్‌ విసిరారు. 

మార్పు మంచిదే

ఐపీఎల్‌ ప్రారంభమైన తర్వాత అత్యధిక స్కోరు 263. సరిగ్గా పదకొండేళ్ల క్రితం యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్‌ 175 పరుగులతో అజేయంగా నిలవడంతో… బెంగళూరు 5 వికెట్లకు ఏకంగా 263 పరుగులు చేసింది. ఈ రికార్డును ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకుండా సన్‌రైజర్స్‌ బద్దలుకొట్టింది. దీనినిబట్టి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాటర్లు ఎంత సమష్టిగా రాణించారో అర్థం చేసుకోవచ్చు. బెంగళూరు అత్యధిక పరుగుల రికార్డును మళ్లీ బెంగళూరో, ముంబై లాంటి జట్టో బద్దలు కొడుతుందనే అంచనాలుండేవి. కానీ ఆశ్చర్యకరంగా హైదరాబాద్‌ రికార్డును సొంతం చేసుకుంది. నెమ్మదైన బ్యాటింగ్‌కు పేరుపడ్డ సన్‌రైజర్స్‌లో వార్నర్‌ కెప్టెన్‌ అయ్యాకే దూకుడు పెరిగింది.

మరిన్ని చూడండి



Source link

Related posts

చరిత్ర సృష్టించిన అన్నూ రాణి-asian games day 10 highlights indian bags another 9 medals to tally annu rani creates history ,స్పోర్ట్స్ న్యూస్

Oknews

Rishabh Pant Batting | DC vs KKR మ్యాచ్ లో కెప్టెన్ గా విఫలమైన రిషభ్ పంత్ | ABP Desam

Oknews

MS Dhoni Celebrating Ganesh Chaturthi: స్వల్ప వివాదంలో చిక్కుకున్న ఎంఎస్ ధోనీ

Oknews

Leave a Comment